
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, చెంగిచెర్ల లోని 12వ డివిజన్ పిట్టల బస్తీలో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి తాగడానికి నీరు లేవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీటన్నింటిని గమనించిన TRP మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా( సెక్రెటరీ) ఎక్కాల మహేష్ పిట్టల బస్తీ వాసుల దాహార్తిని తీర్చాలని నిర్ణయించుకున్నాడు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బోరు వేసి మోటర్ బిగించి బస్తీ వాసుల దాహాన్ని తీర్చాడు బస్తి వాసులు మాట్లాడుతూ గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఎండల ప్రభావంతో తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న మాకు ఒక దేవుడిలాగా బోర్ వేసి మాకు మా పిల్లల బస్తీ వాసుల దాహాన్ని తీర్చిన ఎక్కాల మహేష్ కుటుంబం సల్లగా ఉండాలని బస్తీ వాసులంతా దీవించారు ఇప్పటివరకు మేము బిందెలు పట్టుకొని తాగడానికి నీళ్ల కోసం పరిగెడుతుంటే ఏ నాయకుడు కూడా మాకు తాగునీటి కష్టాన్ని తీర్చలేదని ఎక్కాల మహేష్ దేవుడిలా వచ్చి మా కష్టాన్ని తీర్చినందుకు మేమంతా రుణపడి ఉంటామని బస్తీ వాసులంతా అభినందించారు


