పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు రూ.5 లక్షల పరిహారం
మేడ్చల్, స్వేచ్ఛ, బ్యూరో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి కె వెంకటేష్ ఆదేశించారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2021లో నిందితుడు మైనర్ బాలికను బెదిరింపులకు గురిచేసి ముంబైకు తీసుకెళ్లి లైంగిక దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు
