మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేసి, సుమారు 50 వేల మందితో శివరాత్రి జాగరణను జరిపారు. మల్లారెడ్డి సాధారణంగా చేసే కార్యక్రమాల్లో వైవిధ్యం ఉంటుందని, రాజకీయాలను కూడా ఆయన ఆస్వాదిస్తారని చెబుతారు. తన విద్యాసంస్థలను విస్తరిస్తున్న ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టడం చర్చనీయాంశమైంది.
