మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీ 5 వ వార్డు అభ్యర్థి మాలతి మాధవరెడ్డి నకిలీ వెండి నాణేలను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ దశరథ్ ఆరోపణలు చేశారు. .బి ఆర్ ఎస్ నాయకులు దశరథ్ మాట్లాడుతూ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
