ఓటర్లకు ‘నకిలీ’ బంగారం!

Nagaraju Gaddamidi
0 Min Read

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు పరాకాష్టకు చేరుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు బంగారు నాణేలు పంపిణీ చేశారు. అయితే, తీరా వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారం అని తేలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. బంగారమని ఆశచూపి తమను మోసం చేస్తారా అంటూ స్థానికులు సదరు అభ్యర్థిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *