పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నివాసం ఉంటు ఓపెన్ కాస్ట్ -1 లో జనరల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గూడెల్లి రాజేశం – రాణి ల కూతురు సృజన యూపిఎస్సి ఫలితాల్లో 55 వ ర్యాంకు సాధించింది.
సృజన ఎల్ కేజీ నుండి 10 వ తరగతి వరకు సెంటినరీ కాలనీ లోని వాణి హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య చదివింది. 2018లో మంథని జేఎన్టీయూ లో బీటెక్ పూర్తి చేసిన సృజన సివిల్స్ కు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకుని ఐపిఎస్ అధికారి మహేష్ భగవత్ సూచనల మేరకు 2019 డిల్లి లో కోచింగ్ తీసుకుంది. ఈమధ్య తెలంగాణ గ్రూపు 1 పరీక్షలు రాసిన సృజన 35 వ ర్యాంకు సాధించి డిఎస్పీ గా ఎంపికై ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతుందని తెలిపారు. ఇంతకుముందు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూలలో కొద్ది మార్కుల తేడాతో ఎంపిక కాలేకపోయిన ఈసారి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తన కల సాకారమైందని తెలిపారు.
దీంతో సృజన తల్లిదండ్రుల తో పాటు స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
