మేడ్చల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

Nagaraju Gaddamidi
1 Min Read

మేడ్చల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థుల ఘనత – గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్కేటింగ్ పోటీలో ప్రతిభ

మేడ్చల్‌లోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు స్కేటింగ్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కేటింగ్ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు. ఈ పోటీలో పాఠశాలకు చెందిన మొత్తం 17 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

విద్యార్థులు కఠిన సాధన, పట్టుదలతో పోటీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి విజేతలుగా నిలవడం పట్ల పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఈ విజయంతో ఢిల్లీ వరల్డ్ స్కూల్ మేడ్చల్ మరోసారి క్రీడా రంగంలో తన ప్రతిభను చాటుకుంది.

ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర రావు గారు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి గారు, డైరెక్టర్ సాయినాద్ గారు, ఎగ్జిక్యూటివ్ డీన్ కనకరాజు గారు, ఏజీఎం రామకృష్ణ గారు, పాఠశాల ప్రిన్సిపల్ నిష్ణ రామకృష్ణ గారు మరియు పీ.ఈ.టి లింగం గారు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ వారిని అభినందించారు. భవిష్యత్తులో కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఈ ఘన విజయం పాఠశాలకే కాకుండా మేడ్చల్ ప్రాంతానికీ గర్వకారణంగా నిలిచింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *