పిచ్చికుక్క దాడి చేయడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా
దోమకొండ మండల కేంద్రంలోని మటన్ మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై,మరో ముగ్గురిపై పిచ్చికుక్క దాడి చేసింది.
ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు ముఖంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
గాయపడ్డ వారు చిన్నారులు భవ్యశ్రీ(08), ద్రాక్షాయీని (09) లుగా స్థానికులు గుర్తించారు.
మరో ముగ్గురు దోమకొండ యాదమ్మ,మ్యాదరి యాదమ్మ, తీగ లక్ష్మీలుగా గుర్తించారు.
గాయపడ్డ వారిని వెంటనే

చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు.
మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరు చిన్నారులను హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు తరలించారు.
పిచ్చికుక్కలను తరిమి కొట్టాలనీ ఎన్నిసార్లు పంచాయితీ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపించారు.
ఇప్పటికైనా పిచ్చి కుక్కలను తరిమికొట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.